ఐ.ఇ. కుమార్ కు బాబు జగజ్జీవన్ రామ్ 2024 ఫెల్లోషిప్ అవార్డు

Apr 6, 2024 - 08:17
Apr 6, 2024 - 08:27
 0  5254
ఐ.ఇ. కుమార్ కు బాబు జగజ్జీవన్ రామ్ 2024 ఫెల్లోషిప్ అవార్డు

ఊబలంక ,రెగో న్యూస్  :: రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో అన్నా మినిస్ట్రీస్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో  బాబూ జగజ్జీవన్ రామ్  117వ  జయంతి వేడుకలను మదర్ థెరీసా సేవా సంస్ద అధ్యక్షుడు డా. దిడ్ల కిశోర్   నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. సామాజికవేత్తత ఐ.ఇ. కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సామాజిక సేవలో అత్యుత్తమమైన సేవలు అందించిన సామాజికవేత్త మరియు అంబేద్కర్ వాది ఐ.ఇ. కుమార్ నకు బాబు జగజ్జీవన్ రామ్ ఫెలోషిప్ 2024 అవార్డును అన్నా మినిస్ట్రీస్ అధినేత నేకూరి రాజేష్ కుమార్ మరియు మదర్ తెరిసా సేవా సంస్థ అధినేత డా. దిడ్ల కిషోర్  అందజేశారు. తనను ఈ అవార్డునకు ఎంపిక చేయటం పట్ల సంస్థ ప్రతినిధులకు కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఐ.ఇ.కుమార్  మాట్లాడుతూ నిమ్నకులంలో జన్మించిన బాబు జగ్జీవన్‌రామ్‌ డబ్బు లేకపోయినా, కులవివక్ష ఎదురైనా వాటిని అధిగమించారని, కష్టపడి చదువుకుని సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఎదిగి భారత ఉప ప్రధాని పదవిని అలంకరించారని తెలిపారు. భారత రాజకీయాలలో క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీతో వివిధ మంత్రి పదవులకు వన్నెతెచ్చి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.

భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, అటుతరువాత సమాజంలో సమస్యలను అధ్యయనంచేసి, వాటి పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్రానంతరం మొదటి కార్మిక శాఖ మంత్రి గా కార్మికుల అభ్యున్నతి కోసం పలు చట్టాలు తీసుకువచ్చారన్నారు

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది ఎస్. రత్న మహాలక్ష్మి, ఎమ్ ఎల్ సరస్వతి, సాకా నాగలక్ష్మి, ఏజెన్సీ సిబ్బంది ద్వారపూడి చంటమ్మ, సత్యవేణి , అన్నా మినిస్ట్రీస్ సిబ్బంది సుభద్ర తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow