భార్య పదే పదే పుట్టింటికి వెళ్ళడం భర్తను హింసించించడమే! ఢిల్లీ హై కోర్టు

Apr 6, 2024 - 07:16
Apr 6, 2024 - 07:21
 0  5494
భార్య పదే పదే పుట్టింటికి వెళ్ళడం భర్తను హింసించించడమే! ఢిల్లీ హై కోర్టు

డిల్లీ: భర్త పొరపాటు ఏమీ లేనప్పటికీ భార్య మాటిమాటికీ ఆమె పుట్టింటికి వెళ్లిపోతున్నట్లయితే అతనిని మానసికంగా హింసించినట్లేనని, క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన భావన ఉంటే వారి వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందని జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సంయమనం కోల్పోయిన  దంపతుల మధ్య ఎడబాటు పెరుగుతూపోతే వారు ఎన్నటికీ కలవలేనంతగా పరిస్థితి మారిపోతుందన్నారు. భార్యహింస, క్రూరత్వ చర్యల కారణంగా విడివిడిగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం ఈవ్యాఖ్యలు చేసింది. 19ఏళ్ల వైవాహిక జీవితంలో కనీసం ఏడు సార్లు భార్య తనను వీడి వెళ్లిపోయిందని ఆమె భర్తకోర్టుకు తెలిపారు. అలా వెళ్లిన ప్రతిసారి పది నెలల పాటు పుట్టింటిలో ఆమె ఉందన్నారు. కుటుంబన్యాయస్థానం ఈ జంటకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించగా.... భర్త హైకోర్టును ఆశ్రయించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow