వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటా సంతోషం ! గుత్తుల శ్రీను

Apr 13, 2024 - 08:34
Apr 13, 2024 - 08:37
 0  10152
వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటా సంతోషం ! గుత్తుల శ్రీను
వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటా సంతోషం ! గుత్తుల శ్రీను

జగనన్నను మళ్ళీ సీఎం చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు... ఉభయ రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం  యుత్ అధ్యక్షుడు  గుత్తుల శ్రీను

-ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి
- రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా విశ్వరూప్ ను, ఎంపీ అభ్యర్థి గా రాపాక వర ప్రసాద్ ని గెలిపించండి..

అమలాపురం: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్టంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని.. సంక్షేమ పాలన కొనసాగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని ఉభయ రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం  యుత్ అధ్యక్షుడు  గుత్తుల శ్రీను  అన్నారు. శుక్రవారం వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి విశ్వరూప్,ఎంపి అభ్యర్ధి రాపాక వర ప్రసాద్ ని గెలిపించాలని  అమలా పురం పట్టణంలోని  వీధుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో  గుత్తుల శ్రీను  పాల్గొన్నారు. ఈ సందర్బంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని అమలాపురం అభ్యర్థి  విశ్వ రూప్  ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్ధి విశ్వ రూప్ మాట్లాడుతూ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జనరంజక పాలన అందించారన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించారని తెలిపారు. మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు.  అబద్దపు హామీలు ఇచ్చే టీడీపీ కూటమి చెప్పే మాటలను... ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గుత్తుల శ్రీను మాట్లాడుతూ జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని జోష్యం  చెప్పారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని గుత్తుల శ్రీను  కోరారు. ఈ కార్యక్రమం లో సంఘ నాయకులు  రాయుడు శ్రీను ,పెచ్చెట్టి శ్రీను  ,దొమ్మేటి శంకర్ ,సాయి కృష్ణ  ,దంగేటి శ్రీను పలువురు వైసీపీ ముఖ్య నాయకులు,వైసీపీ ప్రజా ప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యులు,ఎంపీపీలు,వైస్ ఎంపీపీలు,ఎంపీటీసీ సభ్యులు,సర్పంచ్ లు,కో - ఆప్షన్ సభ్యులు,మార్కెట్ ,మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు,కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow