వెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలుశిక్ష - Venkatayapalem Shiromundanam Case

Apr 16, 2024 - 15:02
 0  5127
వెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలుశిక్ష - Venkatayapalem Shiromundanam Case

 రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో నేడు విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది . ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఆ పార్టీ తరఫున మండపేట అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.1.50 లక్షలు జరిమానా విధించారు .

  వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దళితుల శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ, మండపేట వైకాపా అభ్యర్థిగా తోట త్రిమూర్తులను దోషిగా కోర్టు తేల్చింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు ఒకటి న్నర లక్షల జరిమానా విధించింది. శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులోమొత్తం 10 మంది నిందితులకు 18నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. న్యాయస్థానం తీర్పును దళిత, ప్రజాసంఘాలు స్వాగతిస్తున్నాయి. 28 ఏళ్లుగా పోరాడుతున్న తమకు కోర్టు న్యాయం చేసిందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది : 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన జరిగింది. 2019 వరకు 148 సార్లు కేసు వాయిదా అనంతరం నిరవధికంగా విచారణ కొనసాగింది. శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు   ప్రస్తుతం ఆ పార్టీ తరఫున మండపేట అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కేసు తీర్పు వేళ అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ద్రాక్షారామం పోలీస్‌స్టేషన్‌ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు .

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow