జనసేనకు నష్టం లేదు... వైసీపీకి లాభం లేదు!

Mar 29, 2024 - 22:23
 0  5970
జనసేనకు నష్టం లేదు...  వైసీపీకి లాభం లేదు!
  • జంపు జిలాని వ్యవహార శైలిపై చీకుడుతున్న ఓటర్లు

ముమ్మిడివరం :  జనసేన పార్టీ మొట్టమొదటి టికెట్ను శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు ఇచ్చి గౌరవించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి టిడిపి జనసేన  కూటమి పొత్తులో భాగంగా ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కు ముమ్మిడివరం సీట్ను కట్టబెట్టింది. అప్పటివరకు ఈ సీటు నాదే అంటూ...  మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పితానికి గాలి తీసినట్లైంది.

 మొదట్లో ఇతను వ్యవహార శైలి, ప్రవర్తన తెలియని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతనిని నమ్మి టిక్కెట్టు, పార్టీలో కీలక పదవి బాధ్యతలు అప్పగించారు. ఈయన గారి వ్యవహార శైలి పై పూర్తి అవగాహనకు వచ్చిన ఆయన చివరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం మానేశారని . ఈ విషయాన్ని పితాని స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పడం గమనార్హం . తనకు పార్టీ అధిష్టానం నుండి సరైన హామీ లభించడం లేదని మైకు ముందు పార్టీ తనను పట్టించుకోవడం లేదని రాజకీయ నటుడిలా   ఏడ్చేయడం పరిపాటైందని జన నేతలు మండిపడుతున్నారు .

 నెల రోజుల ముందే వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులను కలిసి ,తన డిమాండ్లను వారు వైసీపే పార్టీ అధిష్టానం  ముందు పెట్టారు. ఆ తర్వాత టిడిపి ఇన్చార్జ్ దాట్ల సుబ్బరాజును కలిసి , తనకు మూడు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని ,ఈ విషయాన్ని సుబ్బరాజు తిరస్కరించినట్లు ఆయన బంధువుల ద్వారా తెలిసింది. వ్యూహం బెడిసి కొట్టడంతో మరల వైసీపీ నాయకులతో  పితాని టచ్ లోకి వెళ్లారని అంటున్నారు . అసలే గెలుపు పై అనుమానాలతో ఉన్న వైసిపి పార్టీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ పితానిని ఏదోలా పార్టీలోకి రప్పించాలని పట్టుబట్టారు. తద్వారా శెట్టి బలిజ సామాజిక వర్గం ఓట్లు కూడా తనకు పడిపోతాయని కలలుగన్నారు. మూడు కోట్లు నగదు,ఓ  ఫార్చునర్ కారు  ఇప్పించేందుకు బేరం కుదిరిందని ఆయా పార్టీ నేతలే బహిరంగ వ్యాఖ్యానాలు చేస్తున్నారు

 ఈ విషయం తెలిస్తే ఇన్నాళ్లు ఇతను గౌరవించిన జన సైనికులు ఎదురు తిరుగుతారన్న భయంతో సరికొత్త డ్రామాకు తెర లేపాడు. ముమ్మిడివరంలో సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశానికి కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ వేసుకున్నాడు. సారా మామూలే వారు మైకు ముందు ఊగిపోవటం, ప్రగల్బాల్ పలకడం ,ఏడ్చేయడం  మనకు తెలిసిన సంగతే. దాంతో ఈ కమల్ హాసన్  నా కార్యకర్తలు, అభిమానులను కూడ వెంటనే పార్టీ మారిపొమ్మని అంటున్నారని భేరమ్మన్నాడు. అంతకు ముందు రోజు జనసేన పార్టీ కార్యాలయంలో అల్లరి సృష్టించి బ్యానర్లు తగలబెట్టించి ఫర్నిచర్ ను ధ్వంసం చేద్దామన్న వ్యూహాన్ని రచించాడు.ఏడ్చే మగాడిని నమ్మకూడదని పూర్వీకులు అంటూంటారు. ఈ విషయం తెలిసిన నిజమైన జన సైనికులు అలర్ట్ అయ్యారు పోలీసు ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. దీంతో పితాని  స్కెచ్ బ్రేక్ పడినట్లైంది.

 నియోజకవర్గంలో 2,41541ఓ టర్స్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈయనకు 33000 చిల్లర ఓట్లు వచ్చాయి. మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాపు సామాజిక వర్గం అధిక మొత్తంలో వేయడం వల్ల వచ్చినవేనని, ఇతని ఇమేజ్ వల్ల కేవలం అడపాదడపా 500 ,600 ఓట్లు మాత్రమే పడ్డాయని ప్రసారంలో ఉంది. ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశం ఈసారి దాట్ల సుబ్బరాజుకు దగ్గరగా ఉండటంతో  ఈ విషయాన్ని గుర్తించిన కూటమి అధిష్టానం  సుబ్బరాజుకు బాధ్యతలు అప్పగించడంతో ఇక తనకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకుని ,డబ్బులు ఏవిధంగా రాబట్టుకోవాలని పితాని వ్యూహం పన్నారని  జన నేతలు అంటున్నారు . జనసేన పార్టీలో తిరిగిన జనసైనికులు నాయకులు మాత్రమే పార్టీ ఖర్చులు భరించే వారిని తన జేబులోంచి ఏమీ తీసేవారు కాదని  వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో వారి వద్ద అప్పులు చేసినట్లు కూడా ప్రచారంలో ఉంది.  పార్టీ అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహించుకున్నారని, కొంతమంది స్థలాలను కబ్జా చేశారని ఈ విషయమై పితాని బాలకృష్ణపై ఫిర్యాదులు కూడా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. జనసేన పార్టీ నుండి ఈయన వెళ్లిపోవడం వల్ల ఆ పార్టీకి నష్టం లేదని, వైసీపీ పార్టీకి లాభం లేదని నియోజకవర్గంలో టాక్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow