మద్యం కేసులను తరలిస్తూ పట్టుబడ్డ అధికార పార్టీ నాయకుడి  సుపుత్రుడు

Apr 4, 2024 - 15:55
Apr 4, 2024 - 17:53
 0  5897
మద్యం కేసులను తరలిస్తూ పట్టుబడ్డ అధికార పార్టీ నాయకుడి  సుపుత్రుడు
  • కొమ్ము కాసిన మంత్రి విశ్వరూపు.... ఎమ్మెల్యే పొన్నాడ 
  •  అమాయకులను బలిజేసిన అధికారులు


 కాట్రేనికోన : రాజు  తలుసుకుంటే దెబ్బలు కొదవ అన్నది నాటి సామెత కేసులు గొప్ప అన్నది నేటి సామెత...వివరాల్లోకెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా  వైకాపా ఉపాధ్యక్షుడు నాతి సత్యనారాయణ ప్రస్తుత పల్లంకుర్రు సర్పంచ్ నాతి అలివేణి సుపుత్రుడు.. కందికుప్ప ప్రభుత్వం మద్యం దుకాణంలో సూపర్వైజర్ గా బాధ్యతలు వెలగబెడుతున్నాడు.ఈయన ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ప్రభుత్వ ధరలపై మరో 10 రూపాయలు వేసుకుని దొడ్డి దారిలో బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తూ లక్షలు వెనకేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మద్యాన్ని ఓటర్లకు షాపుకు వచ్చే సీప్ లిక్కర్లను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఈ విషయమై అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ నిఘా  పెట్టింది.యధావిధిగా  వారు దాడి చేసి పట్టుకున్నారు 6 చీప్ లిక్కర్ కేసులను తీసుకెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, మంత్రి పినిపే విశ్వరూప్ లు రంగంలోకి దిగారు ఇతగాడి పేరు కనుమరుగైపోయింది ఎస్ ఈ బి అధికారులు కిక్కురమనటం లేదు . గత 15 రోజులుగా ఈ షాపులో చీప్ లిక్కర్ సామాన్యులకు అందుబాటులో లేదని మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు .అయినప్పటికీ ఎస్ ఈ బి అధికారులు స్పందించకపోవడం వెనుక  ప్రతి నెల వీరికి మామూళ్ల రూపంలో ముట్ట చెబుతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు, రెడ్ హ్యాండెడ్ గా కేసులో పట్టుబడిన అధికార పార్టీ నాయకుడి సుపుత్రుడుకు ఒక న్యాయం సామాన్యులకు మరో న్యాయమా అని కాట్రేనికోన మండల ప్రజానీకం ఈ విషయమై పల్లంకురుకు చెందిన న్యాయవాది కన్నీడి వెంకటరమణ సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow