బాబు చేజేతులా.. కోనసీమలో పట్టు కోల్పోయారా ?సర్వత్రా ఇదే మాట !

Mar 20, 2024 - 11:42
 0  5493
బాబు చేజేతులా.. కోనసీమలో పట్టు కోల్పోయారా ?సర్వత్రా ఇదే మాట !

 

అమలాపురం  (రెగో న్యూస్ ) : కోనసీమలో ఏ పార్టీ  అధికారం ఎవరదనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు నెలలు క్రితం వరకు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కోనసీమలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్విప్ చేస్తుంది అనుకునేవారు. ఇంకా ఎన్నికలు 50 రోజులు మాత్రమే గడువు వుండగా, వైసీపే క్లీన్ స్విప్ చేస్తుందని సామాన్యులు మొదలకొని మేదావుల వరకు అభిప్రాయ పడుతున్నారు.

ఇందులో భాగంగా కోనసీమ సర్వత్రా వినిపించేమాట... గత రెండు నెలలు క్రితం  వరకు టిడిపి కోనసీమ అంతా క్లీన్ స్విప్ చేస్తుందని అనుకున్నాం .. కానీ ఇప్పుడు ఒక ప్రక్క పొత్తులు మరొక ప్రక్క అభ్యర్ధుల ఎంపికలే కొంపముంచాయి .జనసేన .బిజెపి తో పొత్తు కుదుర్చుకొని సీట్ల సర్దుబాటు విషయంలో టిడిపి తప్పుడు పద్దతి వలంభించడంతో ఆ పార్టీ కోనసీమలో కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . మొదటి జాబితాలోనే పి.గన్నవరం అభ్యర్ధి విషయంలో టిడిపి అవలంభించిన తీరు రాష్ట్ర ప్రజలు ఆ పార్టీపై  కన్నెర్ర చేసినట్లైంది. ఈ నియోజకవర్గంలో పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన  స్థానిక నాయకులను   కాదని ,పార్టీ కార్యకర్తల మాటను పెడ చెవిని పెట్టి ,నాన్ లోకల్ అభ్యర్ధిని ప్రకటించిన మరుక్షణం హిందూ ,ముస్లెం,దళితులకు పార్టీ పై ఉన్న అంతో ఇంతో సానుభూతిని కోల్పోయి ,ప్రజలు కన్నెర్ర చేసే స్థాయికి  దిగజార్చుకున్నారు .ఆ నియోజకవర్గంలో వైసీపి పట్ల ప్రజలు  నెగిటివిటీ నుంచి   పాజిటివిటీలోకి వచ్చారు . ఇలా రామచంద్రాపురం .రాజోలు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికలో  ఘోరమైనతప్పును టిడిపి మూటగట్టుకోంది. అంతేకాదు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసిన కోనసీమలోనే బలమైన  దళిత నాయకులు .ఆ పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్ లాంటి నేతలను కనీసం పిలవకుండా ,వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా ,పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డి అనంతకుమారి మాట పట్టించుకోకుండా వ్యవహరించిన తీరు,రెడ్డి సుబ్రహ్మణ్యం లాంటి నేతలను  పార్టీ పక్కన బెట్టడం, చంద్రబాబు ,లోకేష్ వైఖరి  వల్లె కోనసీమ లో వైసీపి పార్టీ కి కలిసివచ్చింది. పార్టిలో పార్టీ భాద్యతలు మోయడమే తప్ప ,తమ అభిప్రాయాలకు విలువనివ్వరు అని ఆ పార్టీ  నేతలకు ,కార్యకర్తలకు అర్ధమైంది .దీంతో  సొంత పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది  .

రాష్ట్రంలోనే మొట్టమొదట డిపాజిట్లు గల్లంతు అయ్యే  సీట్లు  రామచంద్రాపురం ,పి.గన్నవరం అని చెప్పవచ్చు .మిగతా చోట్ల కూడా పార్టీ క్యాడర్ అంతా ఆ పార్టికి దూరంగా ఉందని తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు ,లోకేష్ ల వైఖరి వల్ల చంద్రబాబు చేజేతులా అధికారాన్ని పోగాట్టుకొనే వాతావరణాన్ని సృష్టించుకున్నారని చెప్పక తప్పదు .

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow