జనసేనలో మరో వికెట్ డౌన్..పవన్‌కు షాకిచ్చిన కీలక నేత

Apr 11, 2024 - 05:31
 0  12
జనసేనలో మరో వికెట్ డౌన్..పవన్‌కు షాకిచ్చిన కీలక నేత

టికెట్ల పంచాయితీ కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడు పార్టీలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. ముఖ్యంగా జనసేన పార్టీలో అసమ్మతి కాస్తా ఎక్కువగా కనిపిస్తోంది. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.

పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు సైతం టికెట్ దక్కడం లేదు. 40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్‌ పితాని బాలకృష్ణ ,విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్‌ పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే పాముల  రాజేశ్వరి వంటి నేతలు జనసేనకు రాజీనామా చేయగా, తాజగా మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జ్ మనుక్రాంత్ జనసేనకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ''వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పార్టీలో ఉన్నంత కాలం నిస్సందేహంగా విధేయుడిగా ఉన్నానని, గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశానని అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ నాకు అండగా నిలిచిన మీ అందరికి మరియు జనసేన పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow