జనసేన పార్టీ కాకినాడ ఎం.పి. అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు

Mar 19, 2024 - 19:30
Mar 19, 2024 - 20:14
 0  4640
జనసేన పార్టీ కాకినాడ ఎం.పి. అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు

జనసేన పార్టీ కాకినాడ ఎం.పి. అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసుని ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.పొత్తులో భాగంగా కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు. తన కోసం త్యాగం చేసిన ఉదయ్‌ను కాకినాడ ఎంపీ స్థానంలో పోటీకి పంపిస్తున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దీంతో పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన పోటీ చేస్తుండడం ఖాయమైంది. పిఠాపురానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం నాడు భారీగా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ ఎంపీ అభ్యర్థిపై పనన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

‘‘కాకినాడ ఎంపీ కూడా మనదే.. అందరూ కలిసి పని చేయాలి. కాకినాడ పార్లమెంట్ జనసేన లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలి. చలమలశెట్టి సునీల్, వంగా గీత గారు మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. సునీల్ గారు ఇటీవల ఎక్కడో పెళ్లిలో కూడా నాకు కనిపించారు. సునీల్ మంచివారే గానీ.. తప్పు పార్టీని ఎంచుకున్నారు. లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదని భావిస్తున్నా. వైసీపీకి సుస్థిరత ఇవ్వాలని మనసులో లేదు. అందుకే రాష్ట్రం ఇలా తయారైంది. నా క్యాడర్‌ను నేను రక్షించుకుంటా.. నేను వదలను. కాకినాడ పెన్షనర్ల ప్యారడైజ్ అని అందరూ అంటారు. నేడు కాకినాడ గంజాయికి కేంద్రంగా, క్రైం పట్టణంగా మారింది. వీటిని నిలువరించాలంటే బలమైన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉంటేనే ఇవి సాధ్యం’’ అని అన్నారు.

కాగా ఎంపీగా? లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా? అని బీజేపీ కేంద్ర నేతలు తనను అడిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని వారికి చెప్పానని అన్నారు. ముందు రాష్ట్రం, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని చెప్పానని తెలిపారు. కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులను అధికార వైసీపీ భయాభ్రాంతులకు గురి చేస్తోందని పవన్‌ దృష్టికి కీలక నేతలు తీసుకొచ్చినట్లు సమాచారం.. వైసిపి పార్టి అభ్యర్ధి గెలుపు సునాయసమని అని రాజకీయ విశ్లేషకులఅభిప్రాయం 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow